![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -333 లో.....అసలు మీ నాన్నని ఆ మేడం ఎందుకు కొట్టిందని శ్రీలత వాళ్ళు అడుగుతారు. నాన్నని కొట్టింది అంటే తనదే తప్పు అని రామ్ అంటాడు. అసలేం జరిగి ఉంటుందని శ్రీలత వాళ్ళు ఆలోచనలో పడతారు. సీతాకాంత్ రామలక్ష్మి ఫోటో దగ్గరికి వెళ్లి నా రామలక్ష్మి చనిపోలేదు బ్రతికే ఉందంటూ ఆ దండని తీసేస్తాడు.
మరొకవైపు సీతాకాంత్ ని కొట్టానని చేతిని కాల్చుకోవాలని చూస్తుంది రామలక్ష్మి.. కానీ ఫణీంద్ర వచ్చి ఆపుతాడు. అతన్ని కొట్టినందుకు ఇంత భాదపడుతున్నావంటే అతను కచ్చితంగా నీ భర్త అయి ఉంటాడని ఫణీంద్ర అంటాడు అయితే ఆ విషయం మాకు అక్కడే ఎందుకు చెప్పలేదని సుశీల అంటుంది. తనకి దూరంగా ఉండాలనుకుంటున్నప్పుడు ఎలా చెప్తుందని ఫణీంద్ర అంటాడు. రామలక్ష్మి కోపంగా నేను ఎప్పుడు మీ మనవరాలు మైథిలిగానే ఉంటాను.. అయన నన్ను మార్చిపోయి పెళ్లి చేసుకున్నాడు ఒక బాబు కూడా ఉన్నాడు. ఇక నేను అతన్ని కలవాలనుకోవడం లేదని రామలక్ష్మి అంటుంది. దానికి పెద్దవాళ్ళు కూడా సరే అంటారు. ఆ తర్వాత రామాలక్ష్మి, సీతాకాంత్ కలిసి ఉన్న రోజులని గుర్తుచేసుకుంటుంది. తనతో పిల్లలు పుడితే ఏం పేర్లు పెట్టాలని మాట్లాడుకున్న విషయలు గుర్తు చేసుకుంటుంది. బాబు పుడితే జానకి రామ్ అని పాప పుడితే లక్ష్మీ అని సీతాకాంత్ అన్న మాటలు గుర్తు చేసుకొని బాధపడుతుంది.
తరువాయి భాగంలో సీతాకాంత్ రామ్ ని నిద్రలేపి రెడీ చేసి స్కూల్ కి తీసుకొని వెళ్తాడు. స్కూల్ లేదు కదా అని శ్రీలత వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తారు. రామ్ ని తీసుకొని సీతాకాంత్ స్కూల్ కి వెళ్తాడు. అక్కడా రామలక్ష్మి మేడమ్ వాళ్లతో మాట్లాడి వెళ్లిపోతుంటే తన వెంట వెళ్లి రామలక్ష్మి అంటాడు. దాంతో తను ఆగుతుంది రామలక్ష్మి కాదు మైథిలీ అని అంటుంది. మరి రామలక్ష్మి అంటే ఎందుకు ఆగావని సీతాకాంత్ అడుగుతాడు. దేవుడు పువ్వు కిందపడిపోయిందని రామలక్ష్మి అంటుంది. అబద్దం చెప్తున్నావని సీతాకాంత్ అనగానే.. అవసరం నాకు లేదంటూ కోపంగా వెళ్లిపోతుంది. రామ్ వచ్చి నువ్వు ఆ మేడం తో ఎందుకు మాట్లాడావ్.. తను నిన్ను కొట్టింది అంటాడు. ఆ మేడం నాకూ బాగా తెలుసని సీతాకాంత్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |